![]() |
![]() |
.webp)
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ రియాలిటీ షో ప్రతీ రోజూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. అలాగే లవ్ మాన్షన్ లో లవ్ గురు ఇస్తున్న కాన్సెప్ట్స్ కి కపుల్స్ అంతా చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నారు అలాగే టాస్కులను ఆడుతూ మిగతా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ షో వాళ్ళు నచ్చిన కపుల్స్ కి వోట్ చేసి లవ్ మాన్షన్ లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ని ఆడియన్స్ కి ఇచ్చారు. అంటే నచ్చిన కపుల్స్ కి ఓట్లు వేయొచ్చన్నమాటా. ఇక వీళ్ళను సపోర్ట్ చేస్తూ బయట నుంచి కూడా కొంతమంది వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు.
అందులో భాగంగా జాను అండ్ భాను కపుల్ కి వోట్ చేయమంటూ కొంతమంది స్టార్స్ రంగంలోకి దిగారు. వాళ్లలో ఒకరు శివ కందుకూరి పిలుపునిచ్చారు. జానూ - భాను వాళ్ళు తనకు బాగా తెలుసనీ తన సపోర్ట్ వాళ్ళకే ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే వాళ్ళ గేమ్ నచ్చితే వోట్ చేయాలంటూ చెప్పారు. ఈయన దేవిక అండ్ దాని , గమనం, బూతద్దం భాస్కర్ నారాయణ వంటి మూవీస్ లో నటించారు.
ఇక ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా రంగంలోకి దిగి తనకు జానూ అండ్ భాను బాగా తెలుసు అని వాళ్ళ ఆటతీరును గమనిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వాళ్లకు వోట్ చేయాలంటూ కోరారు. ఆడియన్స్ కి కూడా వాళ్ళ గేమ్ నచ్చితే వోట్ చేయాలనీ చెప్పారు. ఆ షోలో వాళ్ళ గోల్స్ ని రీచ్ కావటానికి వాళ్లకు సపోర్ట్ చేయాలన్నారు రాహుల్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో జానూ అండ్ భాను, నటరాజ్ మాష్టర్ అండ్ నీతూ జోడీస్ మధ్య ఎప్పుడూ గట్టిగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది..
![]() |
![]() |